కీసర, వెలుగు: టెక్సినాప్స్ పేరుతో కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా 24 గంటల జాతీయ స్థాయి హ్యాకథాన్ను గురువారం ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 35కు పైగా కాలేజీల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు తరలివచ్చి తమ సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మలచాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపుతూ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను స్వేచ్ఛ, నాక్ల్యాబ్స్, అవిన్య న్యూరోటెక్ హైదరాబాద్కు చెందిన నిపుణులు సమీక్షించి మార్గదర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ చైర్మన్ హరీశ్ చంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సాగర్, డైరెక్టర్ డాక్టర్ సుసర్ల ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
