మాట నిలబెట్టుకున్న సీఎం.. బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు

మాట నిలబెట్టుకున్న సీఎం.. బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి  రూ.వెయ్యి కోట్లు

సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయ అని.. దానిని కాపాడుకోవాలని గతంలో ఓయూ సందర్శన సందర్భంగా చెప్పిన సీంఎ.. ఉస్మానియా కు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామాఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. 2026–27 బడ్జెట్ లో యూనివ్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించారు. 

తెలంగాణ బడ్జెట్ లో విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా విద్య, మానవ వనరుల శాఖకు 26 వేల 674 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అయిన ఉస్మానియా యూనివర్సిటీకీ రూ.1000 కోట్లు కేటాయించారు. 

అదే విధంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన యూనివర్సిటీలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. 

ALSO READ : తెలంగాణ బడ్జెట్.. డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రవ్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన యూనివర్సిటీ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిధుల కొరతతో ఇబ్బందులు పడకూడదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా యూనివర్సిటీకి వెళ్లి యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కావాలో చెప్పాలని సిబ్బందితో మాట్లాడిన సీంఎ.. విడతల వారీగా బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పారు.