జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సీజ్.. ఇద్దరు అరెస్ట్

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సీజ్..  ఇద్దరు అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు : ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఘట్ కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన మేరకు  కొండాపూర్ లోని విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ పరిధిని విస్తరించడంలో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు.  విషయం తెలియడంతో  సోమవారం ఎస్ఓటీ,  ఘట్ కేసర్ పోలీసులు వెళ్లి దాడి చేశారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం  దేశ్ ముఖ్  గ్రామానికి చెందిన ఆలకుంట్ల మల్లయ్య(50), ఆలకుంట్ల యాదయ్య(57)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 16 జిలెటిన్ స్టిక్స్, 19 డిటోనేటర్ లతోపాటు టాటా హిటాచి వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. బ్లాస్టింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు స్కూల్ కు సిబ్బంది సునీల్ పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు  తీసుకుంటామని సీఐ సైదులుహెచ్చరించారు.