సినిమాలు చేయకపోవడానికి రీజన్ చెప్పిన జెనీలియా

సినిమాలు చేయకపోవడానికి రీజన్ చెప్పిన జెనీలియా

హ హా హాసిని అంటే టక్కున గుర్తొచ్చే పేరు జెనీలియా. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే సెటిల్‌ అయ్యింది. జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే అంటున్న జెనీలియా తాజాగా సినిమాలకు దూరమవ్వడానికి కారణం వివరించింది. 

‘లైఫ్‌లో పెళ్లి, కెరీర్ (సినిమాలు) రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నాకూ అదే అనిపించింది. పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ  టైం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలు చేయడం కుదరలేదు. మధ్యలో బిజినెస్ కూడా ప్రారంభించాం. ఇటు కుటుంబాన్ని చూసుకోవడం, అటు బిజినెస్ మెయింటెన్ చేయడం ఇంత బిజీ లైఫ్ లో సినిమాలకు టైం ఇవ్వడం అస్సలు కుదరలేదు. అందుకే సినిమాలకు దూరమయ్యా. అంతేకానీ వేరే రీజన్ ఏం లేదు. ఇప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెడతా. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా మజిలీతో నన్ను ఆదరించినందుకు సంతోషంగా ఉంది’అని జెనీలియా వివరించింది.