గాంధీలో త్వరలో ఒమిక్రాన్​ సీక్వెన్సింగ్

గాంధీలో త్వరలో ఒమిక్రాన్​ సీక్వెన్సింగ్
  • రీఏజెంట్ల టెండర్లు పూర్తయ్యాయన్న సూపరింటెండెంట్​ రాజారావు
     

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ఒమిక్రాన్​ జీనోమ్​ సీక్వెన్సింగ్​ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెస్టులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజారావు చెప్పారు. బుధవారం ఆయన గాంధీలో మీడియాతో మాట్లాడారు. సీక్వెన్సింగ్​కు అవసరమయ్యే రీఏజెంట్స్​(కెమికల్స్) సరఫరాకు టెండర్ల ప్రక్రియ పూర్తయింద న్నారు. అవి అందిన వెంటనే మైక్రో బయాలజీ ల్యాబ్​ ఇన్​చార్జ్​ ప్రొఫెసర్​ నాగమణి ఆధ్వర్యంలో కరోనా శాంపిళ్లను సీక్వెన్సింగ్​ చేస్తారన్నారు. సీక్వెన్స్​ చేసిన కరోనా శాంపిళ్ల నివేదికల అబ్జర్వేషన్​ కోసం కొన్నాళ్ల పాటు పుణెలోని ఎన్​ఐవీకి పంపుతా మని, పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతే రిపోర్టులను పబ్లిష్​ చేస్తామని ఆయన చెప్పారు. ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు గాంధీ టీమ్​ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 బ్లాక్​ ఫంగస్​ వార్డులు, 18 కరోనా వార్డులున్నాయని చెప్పారు.