కరోనా ఎఫెక్ట్ :ఇంట్లో నుంచి కాలు బయటపెడితే క్షణాల్లో వాలిపోనున్న పోలీసులు

కరోనా ఎఫెక్ట్ :ఇంట్లో నుంచి కాలు బయటపెడితే క్షణాల్లో వాలిపోనున్న పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు పోలీసులు జియో ట్యాగింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.  హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పిన వివరాల ఆధారంగా క్వారంటైన్ లో 20వేల మందితో పాటు హోం క్వారంటైన్ లో ఉన్నవారికి జియో ట్యాగింగ్ చేస్తున్నారని తెలిపారు.

కరోనా వైరస్ వల్ల కుటుంబ సభ్యులకు నష్టం కలుగుతుందని తెలిసినా కొంతమంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. విదేశాల నుంచి వారితో పాటు బయట ప్రదేశాల్లో తిరగడం వల్ల కరోనా వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నా వినిపించు కోవడం లేదని, ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ గా తిరుగుతున్నారని, అలాంటి వారిని అదుపు చేసేందుకు అధికారులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ వల్ల హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్లు ఎక్కడికి వెళ్లారు. ఏం చేస్తున్నారని విషయాల్ని సులభంగా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో పోలీసులు జియో ట్యాగింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్

ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా అలెర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్, నైట్ కర్ప్యూతో పాటు సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో చర్చించనున్నారు.