
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి జూలై 15న సెకండ్ లిరికల్ రిలీజ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్ చూస్తుంటే సాయి ధరమ్..కేతిక శర్మ మధ్య డ్యూయెట్ సాంగ్ అని అర్ధమవుతోంది..కాగా జాణవులే అంటూ సాగే ఈ పాటతో ప్రేమలో మునిగి తేలడానికి రెడీ గా ఉండండి అంటూ ఫ్యాన్స్ కు ముందుగానే అలర్ట్ చేశారు మేకర్స్. ఈ అప్డేట్ తో ప్రేమికులు కూడా రెడీ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ డాన్స్ బ్రో.. లైక్ బ్రో..సాంగ్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వగా..జాణవులే అంటూ వస్తోన్న ఈ సాంగ్ తో ప్రేమికులకు దగ్గర అవ్వడానికి బ్రో టీం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ గీతం ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.
థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా సముద్రఖని(Samuthirakani) బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) మాటలు అందిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్ పై నిర్మిస్తున్నారు.