
కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ను స్వాగతిస్తున్నానన్నారు గద్దర్. తెలంగాణ ఉద్యమకారులు హరగోపాల్, కంచె ఐలయ్యలతో కలిసి గద్దర్ ఇవాళ ఉదయం రాహుల్ ను కలిశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన గద్దర్..రాహుల్ ను మనవడని సంబోధించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకవెళ్తానన్నారు. తెలంగాణ సాదించుకున్నాక కూడా ఎవరు సంతృప్తిగా లేరన్నారు. తెలంగాణలో గుణాత్మక మార్పు లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలన్నారు. యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలన్నారు.