కలిసి పనిచేద్దాం.. ప్రజల కష్టాలు దూరం చేద్దాం

 కలిసి పనిచేద్దాం.. ప్రజల కష్టాలు దూరం చేద్దాం
  • బల్దియా, హైడ్రా కోఆర్డినేషన్​మీటింగ్​
  • అవసరమైతే జ‌‌ల‌‌మండ‌‌లి  స‌‌హ‌‌కారం  
  • జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్ల ప్రకటన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: విపత్తుల టైంలో హైడ్రాతో కలిసి పనిచేసి నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా హెడ్ ఆఫీసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​తో కలిసి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, హైడ్రా అధికారులతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ జేసీ, డీసీ స్థాయి నుంచి డీఈలు, ఏఈలు ఇలా అన్ని స్థాయిల్లో హైడ్రాకు పూర్తి స‌‌హ‌‌కారం అంద‌‌జేయాల‌‌ని నిర్ణయించారు. నాలా నెట్​వ‌‌ర్క్​పై పూర్తి అవ‌‌గాహ‌‌న ఉన్న జీహెచ్ఎంసీ ఏఈలు, డీఈలు ఫీల్డ్‌‌మీద ప‌‌నిచేస్తున్న హైడ్రా మాన్సూన్ ఎమ‌‌ర్జన్సీ టీమ్‌‌(ఎంఈటీ)లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు(డీఆర్ ఎఫ్) బృందాల‌‌కు స‌‌హ‌‌కారం అందించాల‌‌ని ఇద్దరు క‌‌మిష‌‌న‌‌ర్లు సూచించారు. 

అవసరమైన ప్రాంతాల్లో జ‌‌ల‌‌మండ‌‌లి స‌‌హ‌‌కారం కూడా తీసుకోవాల్సిన అవ‌‌స‌‌రం ఉంద‌‌ని నిర్ణయించారు. కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ లో ఓపెన్ నాలా డీ – సిల్టింగ్, నిర్వహణ, కొత్తగా నిర్మించిన సంపుల నిర్వహణను జీహెచ్ఎంసీ చూసుకుంటుందని, లేక్ లలో నీటి నిల్వ స్థాయి సమాచారాన్ని హైడ్రాతో పంచుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు.హైడ్రా కమిషనర్  రంగనాథ్ మాట్లాడుతూ... నగరంలోని 11 అండర్ పాస్ ల నిర్వహణ బాధ్యత హైడ్రా తీసుకుంటుందన్నారు. 

ఫ్లై ఓవర్లపై వర్షపు నీరు వెళ్లే మార్గాలను తాము క్లీన్​చేస్తామన్నారు. క్యాచ్ పిట్ లలో డీ సిల్టింగ్ బాధ్యతలను, నాలా సేఫ్టీ ఆడిట్ బాధ్యతలు కూడా చూస్తామన్నారు. క్యాచ్ పిట్ లలో డీ సిల్టింగ్ చేయగా వచ్చే మట్టిని తరలించేందుకు వీలుగా వార్డుల వారీగా  పాయింట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవరావు, రవి కిరణ్, వెంకన్న, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, లేక్స్ చీఫ్ ఇంజినీర్  కోటేశ్వర రావు, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.