ఫ్లైఓవర్​ ప్రతిపాదిత స్థలం పరిశీలన : కమిషనర్ ఆమ్రపాలి

ఫ్లైఓవర్​ ప్రతిపాదిత స్థలం పరిశీలన : కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్, వెలుగు : బాగ్ లింగంపల్లి సుందరయ్య, మదర్​డైరీ పార్కులోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో కలిసి గురువారం ఆమె సుందరయ్య పార్క్, మదర్ డైరీ పార్క్, వీఎస్టీ నుంచి బాగ్ లింగంపల్లి వరకు ఫేజ్ –2 ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సుందరయ్య పార్కులోని వాకర్స్​సమస్యలను తెలుసుకున్నారు.