చెత్త పేరుకుపోయినా పట్టించుకోరా?.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ ఫైర్

చెత్త పేరుకుపోయినా పట్టించుకోరా?.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ ఫైర్

హైదరాబాద్: నగరంలో రోడ్ల మీద చెత్త రోజుల తరబడి పేరుకుపోవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ల మీద మండిపడ్డారు. చెత్త సేకరించే వాహనాలు ఎన్ని ఉన్నాయి, చెత్తను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదనే అంశాల మీద ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులతో లోకేశ్ రివ్యూ నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్‌‌లోని మంగల్ హాట్, గోషా మహల్, విజయ నగర్ కాలనీ, జోనల్ కమిషనర్ కార్యాలయానికి దగ్గరగా ఉన్న చింతల్ బస్తీలో చెత్త కుండి పాయింట్స్‌‌లో 100 మీటర్ల వరకు చెత్త పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో చెత్త ఎక్కువగా పేరుకుపోతున్న  ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేయాలని జోనల్ కమిషనర్లను లోకేశ్ కుమార్ ఆదేశించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రాకపోవడంపై లోకేష్ ఫైర్ అయ్యారు.