
హైదరాబాద్‌లోని పబ్లిక్ టాయిలెట్స్‌పై దృష్టి ఎందుకు పెట్టలేదని రెండు రోజుల క్రితం నిర్వహించిన రివ్యూలో జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం తెల్లవారుజాము నుంచే వరస ఫీల్డ్ విజిట్‌లు చేస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలు సర్కిల్స్‌లోని టాయిలెట్స్‌ను కమిషనర్ లోకేష్ కుమార్ ఇన్ప్‌పెక్షన్ చేశారు. ఖైరతాబాద్ జోన్‌లో టాయిలెట్స్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ఇప్పటికే పలుసార్లు జోనల్ కమిషనర్ ప్రావీణ్యపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో టాయిలెట్స్ చాలా చోట్ల డ్యామేజ్ అయ్యి ఉన్నాయని కమిషనర్ గమనించారు.