
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్బీనగర్ జోన్లోని పలు ప్రాంతాల్లో గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు. సరూర్ నగర్లోని వెంకటేశ్వర కాలనీకి వెళ్లగా, ఆ కాలనీకి చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్ ను కలిసి కాలనీకి సంబంధించి పలు సమస్యలు వివరించారు.
వెంటనే సమస్య లు పరిష్కరించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే వల్లభ నగర్ లో వాటర్ లాగింగ్ పాయింట్ ను పరిశీలించారు.