
- పోస్టులు షేర్ చేసినా వదలం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు, తప్పుడు సమాచారం పోస్టులు చేయడంతో పాటు వాటిని షేర్ చేసినా.. బాధ్యులపై చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సినీ హీరోయిన్ల పేర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేశారని మండిపడ్డారు. మార్ఫింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ఫేక్ ఓటరు గుర్తింపు కార్డులు వైరల్ చేశారన్నారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు.