- నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి రోజు ఉదయం 9.30 గంటల లోపు సిటీలోని మెయిన్రోడ్లపై చెత్త పూర్తిగా తొలగించి క్లీన్ గా ఉంచాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈ(సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల)పై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.
బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన శానిటేషన్‌పై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల తర్వాత మెయిన్రోడ్లపై ఎక్కడా ఊడుస్తున్నట్టు కనిపించవద్దన్నారు. గ్రీన్ వేస్ట్తొలగింపు బాధ్యతను కూడా ఇకపై ఎస్‌డబ్ల్యూఎం విభాగమే నిర్వహించాలని తెలిపారు. అలాగే సీ అండ్ డీ వ్యర్థాలు, దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, గ్రీన్ వెస్ట్‌ను వేగంగా తొలగించేందుకు అదనపు వాహనాలు సమకూరుస్తామన్నారు. అడిషనల్ కమిషనర్ రవికిరణ్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, మందా మకరందు, ముకుందారెడ్డి, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.
