- లంగర్‌హౌస్ మస్కిటో టవర్స్ పై ఆగ్రహం
- సీనియర్ ఎంటమాలజిస్ట్‌పై వేటు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో దోమల నియంత్రణ చర్యల్లో లోపంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలకు తీసుకుంటామని హెచ్చరించారు. వరుసగా రెండు రోజుల పాటు మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్ లోనే కాకుండా డైరెక్ట్‌గా తనను కలిసిన అధికారులపైనా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతి ఏరియాలో దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
సీనియర్ ఎంటమాజిలిస్ట్ పై యాక్షన్
లంగర్ హౌస్హుడా పార్కు చెరువులో గుర్రెపు డెక్క తొలగించకపోవడంతో అక్కడ దోమలు టవర్స్ మాదిరిగా ఏర్పడినట్లు ‘వీ6 వెలుగు’లో పబ్లిష్అయిన కథనంపై కమిషనర్ఆరా తీశారు. చెరువు వద్ద దోమల వ్యాప్తి చెందకుండా చేసే పనుల విషయంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఎంటమాజిలిస్ట్ గంగప్పను సొంత డిపార్టుమెంట్ అయిన హెల్త్ శాఖకి సరెండర్చేశారు.
అలాగే, పార్కు లేక్ వద్ద రెండో రోజు గుర్రపు డెక్కను తొలగించే పని కొనసాగింది. డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా ఆపరేషన్కూడా చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఎంటమాలజీ విభాగం, మెడికల్ ఆఫీసర్లతో అడిషనల్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. దోమల ఉధృతికి కారణమవుతున్న ప్రాంతాలు, నిల్వ నీటి ప్రాంతాలు, చెరువులు, నాలాలు, పార్కుల్లో చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ పై ఆయన సమీక్ష జరిపారు. అధికారులంతా ఫీల్డ్లెవెల్లో ఉండి దోమల సమస్య పరిష్కారానికి పని చేయాలన్నారు.
