Cybercrime: క్రెడిట్‌కార్డు లిమిట్పెంచుతామని ఓ వ్యక్తి బ్యాంక్అకౌంట్నుంచి రూ.6 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన సైబరాబాద్సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లింగంపల్లి కానుకుంట ప్రాంతానికి చెందిన రాజు రామకృష్ణ ట్రాన్స్ పోర్ట్సూపర్వైజర్గా చేస్తున్నాడు. ఇతనికి ఆర్బీఎల్ప్లాటినమ్ప్లస్క్రెడిట్కార్డు ఉంది.
ఈ నెల19న ఓ వ్యక్తి కాల్చేసి, తాను ఆర్బీఎల్ బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పడంతో రామకృష్ణ అంగీకరించాడు. దీంతో అతను రామకృష్ణ వాట్సప్‌కు ఆర్బీఎల్ యాప్బ్యాంక్ పేరుతో ఏపీకే లింక్పంపించాడు. దాన్ని క్లిక్ చేయగానే ఆరుసార్లు రూ.లక్షల చొప్పున రూ.6 లక్షలు క్రెడిట్ కార్డు నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైంపోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ట్రేడింగ్ పేరుతో రూ.11 లక్షలు..
ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.11 లక్షలు కాజేశారు సైబర్ మోసగాళ్లు. ఈ ఘటన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన రవి కిరణ్ కు గత ఏప్రిల్6న వాట్సప్‌లో యాక్సిస్సెక్యూరిటీస్పేరుతో ట్రేడింగ్గ్రూప్మెసేజ్వచ్చింది. ప్రణవ్, అనయ మెహ్రా ఫోన్‌చేసి.. తాము పెట్టుబడులు పెట్టడంలో సహాయపడతామని రవి కిరణ్‌ను నమ్మించారు.
దీంతో అతను దశల వారీగా రూ.13.36 లక్షలను ట్రేడింగ్యాప్లో పెట్టుబడి పెట్టాడు. రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత రూ.9.34 లక్షలు ప్రాఫిట్వచ్చినట్లు యాప్‌లో చూపించినా.. విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ. 4 లక్షలు చెల్లించాలని ప్రణవ్, అనయ మెహ్రా డిమాండ్‌చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
