కల్తీ మసాలాల కేసులో కౌంటర్ వేయండి..పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

 కల్తీ మసాలాల కేసులో కౌంటర్ వేయండి..పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: కల్తీ మసాలాలు తయారు చేస్తున్నారంటూ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితులకు ఉపశమనం కలిగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కల్తీ మసాలాల తయారీ కేసును కొట్టివేయాలని కోరుతూ వికాస్ అగర్వాల్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆహార కల్తీపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు లేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. నగరంలో ఆహార కల్తీని అడ్డుకునేందుకు పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.