
GHMC పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. మరోవైపు ఈ ఎన్నికలను బ్యాలట్ పేపర్ల ద్వారా నిర్వహించబోతున్నారు. బీహార్, దుబ్బాకలో అనుసరించిన ఎన్నికల వ్యూహం ప్రకారం ఎన్నికల కమిషన్ అధ్యయనం చేస్తోంది. కరోనా క్రమంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగనున్నారు. 2016 ఎన్నికల్లో 6,900 పోలింగ్ కేంద్రాలుండగా… ఈసారి 9,248 కేంద్రాలను గుర్తిస్తూ, ముసాయిదా జాబితాను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. గతంలో 1,400 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా..కరోనా కారణంగా వెయ్యి మందికో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సలహాలు స్వీకరించనున్నారు. 18న అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి చేస్తారు. 19న తుది జాబితాను ఎన్నికల అధికారికి పంపుతారు. 21న వార్డుల వారీగా తుది జాబితా వస్తుంది. దాదాపు 70 వేల మంది ఓటర్లున్న కొండాపూర్ వార్డులో అత్యధికంగా 99, 27 వేలకు పైగా ఓటర్లు మాత్రమే ఉన్న ఆర్‌సీపురంలో 33 పోలింగ్ కేంద్రాలున్నాయి. కాప్రా-312,ఉప్పల్-203,హయత్‌నగర్-290,ఎల్‌బీనగర్-218, సరూర్‌నగర్-338,మలక్ పేట్-443, సంతోషనగర్ -383, చాంద్రాయణగుట్ట-371,చార్మినార్-291 ఫలక్ నూమా,-291, రాజేంద్రనగర్-316, మెహిదీపట్నం-429, కార్వాన్-342, గోషామహల్-329, ముషీరాబాద్-430,అంబర్‌పేట-370, ఖైరతాబాద్-254 జూబ్లీహిల్స్-267, యూసుఫ్ గూడ-330, శేరిలింగంపల్లి-265, చందానగర్-350, ఆర్‌సీపురం, పటాన్‌చెరు-120, మూసాపేట-361, కూకట్‌పల్లి-465, కుత్బుల్లాపుర్-245, గాజుల రామారం-203, అల్వాల్-160, మల్కాజ్‌గిరి-319, సికింద్రాబాద్-289, బేగంపేట-256