
హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీలో నామినేషన్ల దాఖలు ముగిసింది. 150 డివిజన్లకు మొత్తం 1,932 మంది క్యాండిడేట్స్ 2,602 నామినేషన్లు వేశారు. పూర్తి సమాచారం మేరకు శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది క్యాండిడేట్స్ 1,937 నామినేషన్లు అందజేశారు. వీరిలో బీజేపీ నుంచి 571 మంది, సీపీఐ నుంచి 21, సీపీఎం నుంచి 22, కాంగ్రెస్ నుంచి 372, ఎంఐఎం నుంచి 78, టీఆర్ఎస్ నుంచి 557 మంది, టీడీపీ నుంచి 206, రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 115 మంది, ఇండిపెండెంట్స్650 మంది నామినేషన్లు వేశారు. శనివారం అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు.