
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జీహెచ్ఎంసీ రోడ్‌సేఫ్టీ డ్రైవ్‌ను మరింత వేగవంతం చేసింది. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా గుంతల పూడ్చివేత, క్యాచ్ పిట్ రిపేర్లు, రోడ్ల మరమ్మత్తు పనులు, ప్యాచ్ వర్క్, కవర్ రీప్లేస్‌మెంట్లు, సెంట్రల్ మీడియన్ రిపేర్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ మెయింటెన్స్ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ ఫీల్డ్‌కు వెళ్లి డ్రైవ్ పర్యవేక్షిస్తున్నారు.
అక్టోబర్10 నాటికి సిటీలో 16,541 గుంతలు గుర్తించి14,112 గుంతలకు రిపేర్లు చేశామని, ఇప్పటి వరకు 771 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 367 కవర్ రీప్లేస్‌మెంట్లు, 18 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు చేశామన్నారు. ఎల్బీనగర్జోన్లో 2,743 , చార్మినార్ జోన్‌లో 2,235, ఖైరతాబాద్ జోన్‌లో 1,987, శేరిలింగంపల్లి జోన్‌లో 1,576, కూకట్‌పల్లి జోన్‌లో 2,308, సికింద్రాబాద్ జోన్‌లో 3263 గుంతలను పూడ్చినట్టు చెప్పారు.