అత్యవసరం అయితే బయటకు రండి.. సమస్య ఉంటే ఈ నెంబర్లను డయల్ చేయండి

అత్యవసరం అయితే బయటకు రండి.. సమస్య ఉంటే ఈ నెంబర్లను డయల్ చేయండి

హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషర్ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండల్లా మారిన నేపథ్యంలో  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి వేస్తున్నారు. ఈ క్రమంలో  మూసీ నది  పరివాహక ప్రాంతాలు, నది  లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఏదైనా సమస్య ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ లైన్‌ నెంబర్ 040- 21111111 నెంబర్‌ లేదా డయల్‌ 100కి కాల్‌ చేయాలని సూచించారు. అలాగే ఈవీడీఎమ్‌ కంట్రోల్ రూమ్‌ 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు