ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు

ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు

హైదరాబాద్: ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల‌ను పంపిణీ చేసింది. ఓట‌రు స్లిప్‌ల డౌన్‌లోడ్‌కు ప్ర‌త్యేక యాప్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మైజీహెచ్ఎంసీ అనే యాప్‌‌లో ‘నో యువర్ ఓట్ ఆప్షన్’లో పేరు, వార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్‌‌తోపాటు గూగుల్ మ్యాప్ వివరాలు కూడా వస్తాయి.

నో-యువర్ ఓట్ పై ఎఫ్.ఎం రేడియో, టీవీ స్క్రోలింగ్, బస్ షెల్టర్స్ మీద హోర్డింగ్‌‌ల ద్వారా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ ప్రచారం చేస్తోంది. అలాగే తొలిసారిగా ఓట‌ర్ల జాబితాను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టింది. ఓట‌రు చైత‌న్యంపై హోర్డింగ్‌ల ఏర్పాటుతోపాటు జీహెచ్ఎంసీకి చెందిన 1,500 సెల్‌ఫోన్ల రింగ్‌టోన్‌ల ద్వారా చైత‌న్యం కల్పిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు ప‌లు క‌మిటీలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలోని స్వ‌యం స‌హాయ‌క బృందాల ద్వారా ప్ర‌త్యేక ఓట‌రు చైత‌న్య కార్య‌క్ర‌మం నిర్వహిస్తోంది. స‌ర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ల స‌మావేశం నిర్వహించింది