దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు.. GHMC హెడ్ ఆఫీస్ తనిఖీ చేసిన మేయర్..

దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు.. GHMC హెడ్ ఆఫీస్ తనిఖీ చేసిన మేయర్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేక డిపార్ట్మెంట్ లలో ఉద్యోగులు టైంకి రావడం లేదని గుర్తించారు. పలు విభాగాల్లో మధ్యాహ్నాం 12 అయినా ఉద్యోగులు డ్యూటీకి రాలేదని గమనించారు. ఉద్యోగుల టైమింగ్ విషయంలో మేయర్ సీరియస్ అయ్యారు. పని చేయాలని అనిపిస్తే రావాలని లేకపోతే వెళ్లిపోవాలని విజయలక్ష్మి ఫైర్ అయ్యారు.  

ఇదిలా ఉండగానే ఉద్యోగులు టైంకి రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే తనకు టైమింగ్ ఫైల్స్ చూపించాలని సూచించారు. ఒక్కో డిపార్ట్మెంట్ లో ఎంత మంది పని చేస్తారు..  ప్రస్తుతం ఎంత మంది ఉన్నారనే లెక్కలు బయటకు తీస్తున్నారు మేయర్.