హైదరాబాదీలు ఎవరూ బయటకు రావొద్దు : భారీ వర్షంపై జీహెచ్ఎంసీ వార్నింగ్

హైదరాబాదీలు ఎవరూ బయటకు రావొద్దు : భారీ వర్షంపై జీహెచ్ఎంసీ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండురోజులుగా కుండ‌పోత వ‌ర్షం కురుస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. నగరంలో సహాయక చర్యలు చేపట్టింది.  అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ .. నగరవాసులకు పలు సలహాలు, సూచనలు చేశారు. 

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాసులందరూ తమ ఇళ్లల్లోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించారు మేయర్ విజయలక్ష్మీ. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, మరీ ఎమర్జెన్సీ అయితేనే వెళ్లాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదని హెచ్చరించారు. ఏవైనా వర్షాలకు సంబంధించిన సమస్యలు, సహాయం కోసం 040-21111111 నెంబర్ లో సంప్రదించాలని కోరారు హైదరాబాద్ సిటీ మేయర్. 

మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు గురువారం రెండు రోజుల సెలవులు ప్రకటించింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

https://twitter.com/GadwalvijayaTRS/status/1681978904628842496