31 మంది ప్రాపర్టీదారులపై కేసులు.. చెక్​బౌన్స్​లపై జీహెచ్ఎంసీ చర్యలు

31 మంది ప్రాపర్టీదారులపై కేసులు.. చెక్​బౌన్స్​లపై జీహెచ్ఎంసీ చర్యలు

హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్​కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంపై జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీలోని వేర్వేరు సర్కిళ్ల పరిధిలో మొత్తం 31 మంది ప్రాపర్టీ దారులపై కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2023–-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.1921కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఇందులో రూ.11 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ అయినట్లు కమిషనరన్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

ప్రాపర్టీదారులు చెక్ బౌన్స్ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేకపోతే కేసులు తప్పవని హెచ్చరించారు. అలాగే భవిష్యత్తులో చెక్​బౌన్స్ కాకుండా చూసుకోవాలని చెప్పారు.   మంగళవారం జూబ్లీహిల్స్ సర్కిల్​లో 5, శేరిలింగంపల్లి 4, చందానగర్ 13, కుత్బుల్లాపూర్ 4, మూసాపేట 4, కూకట్ పల్లిలో ఒక చెక్​బౌన్స్​ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.