విమెన్ క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

విమెన్ క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్ మహిళా క్రికెటర్ ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని రంజీ ప్లేయర్ భోగి శ్రావణి ఇంటిని అధికారులు కూల్చివేశారు. దీంతో శ్రావణి, ఆమె తండ్రి, వాళ్లు పెంచుకుంటున్న రెండు డాగ్స్ కమ్యూనిటీ హాల్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయంపై శ్రావణి స్పందిస్తూ.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారని శ్రావణి ఆరోపించింది. 

గత 35 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నామని శ్రావణి చెప్పింది. అయితే తన మేనమామ కొడుకులు తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. పోలీసులతోపాటు ఎమ్మెల్యే పద్మారావు కొడుకు రమేశ్వర్ గౌడ్ తోనూ తమను బెదిరించారని తెలిపింది. రాజకీయ అండతో తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించింది. ఈ ఘటనపై బీజేవైఎం సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్ స్పందించారు. శ్రావణికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక మంచి క్రీడాకారిణికి ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి.. ఇల్లూ, వాకిలి లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మహిళా ఎంపీతో థ‌రూర్ చిట్‌చాట్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్