ఇవాళ్టి నుంచి మిడ్ డే అటెండెన్స్

ఇవాళ్టి నుంచి మిడ్ డే అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: కార్మికుల ఫేక్ అటెండెన్స్ కు చెక్​పెట్టేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే బయోమెట్రిక్ స్థానంలో ఫేస్ రికగ్నిషన్ ను అందుబాటులో తీసుకురాగ, మంగళవారం నుంచి మిడ్ డే అటెండెన్స్ తీసుకోనున్నారు. ఇటీవల కొందరు ఎస్ఎఫ్ఏలు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ లోనూ అక్రమాలకు పాల్పడ్డారు. 

ఫొటోలతో ఫేక్​అటెండెన్స్ కి ప్రయత్నించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఫేస్​రికగ్నిషన్​లో అక్రమాలకు తావులేకుండా మిడ్ డే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభించారు. వర్క్​లోకేషన్ ఆధారంగా ఎస్ఎఫ్ఏలు అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో అక్రమాలకు తావులేకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపు, ఉదయం 10–30 గంటల నుంచి 11 గంటల మధ్యన, 12 నుంచి ఒంటి గంట లోపు అటెండెన్స్ తీసుకుంటారు.