టీఎక్స్​ హాస్పిటల్​కు రూ.50 వేలు ఫైన్

టీఎక్స్​ హాస్పిటల్​కు రూ.50 వేలు ఫైన్
  • అపరిశుభ్రంగా హాస్పిటల్ ​కిచెన్
  • చర్యలు తీసుకున్న బల్దియా అధికారులు 

ఉప్పల్, వెలుగు: జీహెచ్ఎంసీ శానిటేషన్​ఆఫీసర్లు సోమవారం ఉప్పల్ లోని టీఎక్స్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్​కిచెన్, పేషెంట్లకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.

 కిచెన్​లో వెంటిలేషణ్​సరిగా లేకపోవడంతోపాటు అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు. హాస్పిటల్ యాజమాన్యానికి రూ.50 వేల జరిమానా విధించారు. శానిటేషన్​సెక్షన్ హెడ్ చందన ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే వివిధ హాస్పిటళ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో తనిఖీలు కొనసాగాయి.