హైదరాబాద్ లో పెద్ద సమోసా ఫ్యాక్టరీ క్లోజ్..కారణం తెలిస్తే యాక్ తూ అంటారు

హైదరాబాద్ లో  పెద్ద సమోసా ఫ్యాక్టరీ క్లోజ్..కారణం తెలిస్తే యాక్ తూ అంటారు

హైదరాబాద్ నగరంలో కల్తీ ఫుడ్, నాణ్యతలేని ఫుడ్ వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. ఇష్టారీతిన హోటల్స్, రెస్టారెంట్లు,స్వీట్ షాపులు, తినే తిండిలో  కల్లీ కలకలం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులు  హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు.  నిన్నటి వరకు రెస్టారెంట్లు,హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇపుడు స్వీట్ షాపులు, చిన్న చిన్న హోటల్స్, సమోసాలు,స్నాక్స్  సెంటర్లపై తనిఖీలు చేస్తున్నారు.

జూన్ 14న ఫుడ్ జీహెచ్ఎంసీ గోల్కోండలోని ఓ సమోసా సెంటర్ ను సీజ్ చేసింది. గోల్కొండ ఫోర్ట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సమోసా తయారీ సెంటర్ ను సీజ్ చేశారు . బడా బజార్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సమోసాల తయారీ చేస్తున్నారు నిర్వాహకులు.  దీంతో స్థానికులు  జీహెచ్ఎంసీ కి ఫిర్యాదు చేశారు. కమిషనర్   ఆదేశాల మేరకు తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..  ఎలాంటి లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో  సమోసాల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.  సమోసా తయారీకి  కల్తీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. 

ఈ మధ్య హైదరాబాద్ నగరంలో బయట ఏం తినాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. ఎందులో ఏం కలుపుతున్నారో.. ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారో తెలుసుకుంటే వాటిని తినలేం, వాటిని చూస్తేనే వాంతొచ్చేలా ఉంటాయి.