మూడురోజుల్లో గుంతలు పూడ్చకుంటే జీతాల్లో కోత

మూడురోజుల్లో గుంతలు పూడ్చకుంటే జీతాల్లో కోత

జీహెచ్ఎంసీ సిబ్బందికి కమిషనర్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో  ప్రైవేట్​ ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లపై గుంత పడిన మూడు రోజుల్లోగా రిపేర్లు చేయించకపోతే సిబ్బంది జీతాల్లో కోత పెడ్తామని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ లోకేష్​ కుమార్ వార్నింగ్​ ఇచ్చారు. రోడ్ల రిపేర్లు చూడాల్సిన బాధ్యత జీహెచ్​ఎంసీ ఈఈ, ఎస్‌‌ఈ, జడ్‌‌సీలదేనని ఇటీవల సర్క్యూలర్‌‌ జారీ చేశారు.  కాంప్రహెన్సీవ్​ రోడ్​ మెయింటెనెన్స్​ ప్రోగ్రాం (సీఆర్​ఎంపీ)లో భాగంగా గ్రేటర్‌‌ హైదరాబాద్​లోని 709 కిలోమీటర్ల  మెయిన్​ రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఐదేండ్ల  కాలపరిమితితో రూ. 1,837 కోట్లకు ఏడాది కింద ప్రైవేట్‌‌ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది. ఒప్పందం ప్రకారం.. రోడ్డుపై గుంత పడిన మూడు రోజుల్లోగా దాన్ని పూడ్చకపోతే బల్దియా ఆఫీసర్లు సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలి. స్పందించకపోతే జరిమానా కూడా విధించాలి. కానీ ఆఫీసర్లు రోడ్లపై నిఘా పెట్టకపోవడంతో ఏజెన్సీలదే ఇష్టారాజ్యమైపోయింది.

రోడ్లపై వెళ్లాలంటే నరకమే!

హైదరాబాద్​లో  అనేక  రోడ్లు గుంతలు, కంకర తేలి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు ఇప్పటికే 50 శాతం రోడ్లపై  కొత్త రోడ్లు వేయాల్సి ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో వేయలేదు. రోడ్ల నిర్వహణ ఏమాత్రం బాగాలేదు. గుంతలు పడి రోజులు గడిచినా పట్టించుకోవడంలేదు. దీనిపై సిటీ జనాల  నుంచి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కమిషనర్ లోకేష్ కుమార్​ సర్క్యూలర్‌‌ జారీ చేశారు. గ్రేటర్‌‌ పరిధిలో మొత్తం 9,103 కిలోమీటర్ల రోడ్లున్నాయి. ప్రైవేట్ సంస్థ లకు అప్పగించిన 709 కిలోమీటర్ల రోడ్లను మినహాయిస్తే మిగిలిన 8,394  కిలో మీటర్ల రోడ్లు జీహెచ్‌‌ ఎంసీ ఆధీనంలో ఉన్నాయి.

For More News..

ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం షేర్‌‌ ఇస్తలేదు

రోజురోజుకూ దిగోస్తున్న బంగారం ధర