బల్దియా ప్లాన్.. వాట్సప్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికే నిత్యవసరాలు

బల్దియా ప్లాన్.. వాట్సప్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికే నిత్యవసరాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:డైలీ లైఫ్​లో  సోషల్‌‌‌‌ మీడియా యూసేజ్​ మరింత పెరుగుతోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్​కు ఇన్ఫర్మేషన్ ​షేర్ చేసుకునేందుకు, కొలిగ్స్​తో ఆఫీస్​విషయాలు పంచుకునేందుకు ప్రస్తుతం వాట్సాప్‌‌‌‌  ​ ఒక మంచి ప్లాట్​ఫామ్. కరోనా నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు  బల్దియా కూడా వాట్సాప్​ను విస్తృతంగా ఉపయోగిస్తోంది. కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లలోని ప్రజల అవసరాలను గ్రూప్​ద్వారా తెలుసుకుని నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. మెడికల్ ​సజెషన్స్​నూ ఒకేసారి అందరికీ చేరవేస్తోంది. నిర్వహణను పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియాల్లో వాట్సాప్‌‌‌‌ గ్రూపులు కీలకంగా మారాయి.

నేరుగా ఇంటి వద్దకే..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 260 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. అందులో146 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. పాజిటివ్‌‌‌‌ కేసు నమోదైన వ్యక్తి ఇంటి నుంచి సుమారు 100 – 250 మీటర్ల పరిధిని అధికారులు కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియాగా పరిగణిస్తున్నారు. రాకపోకలు నిషేధించి.. స్థానికులకు అవసరమైన పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, ఔషధాలను ఇంటికే సరఫరా చేస్తున్నారు. ఒక్కో జోన్‌‌‌‌ పరిధిలో సుమారు 100 నుంచి 200 ఇళ్లకు పైనే ఉన్నాయి. ప్రజలు జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులకు ఫోన్‌‌‌‌ చేసి అవసరాలు చెబుతున్నారు. ఇలా నిత్యావసరాల కోసం డైలీ వందల సంఖ్యలో కాల్స్‌‌‌‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఒక ఆలోచన చేశారు. జోన్‌‌‌‌ పరిధిలో నివాసం ఉంటున్న వారి వాట్సాప్​ నంబర్లు కలెక్ట్​చేసి గ్రూప్  క్రియేట్​చేస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా జోన్లలో పూర్తిచేశారు. గ్రూపులో బల్దియా, పోలీస్, మెడికల్, రెవెన్యూ, విద్యుత్​ ఉద్యోగులను యాడ్​చేస్తున్నారు. జనం అవసరమైన నిత్యావసరాలు, ఇంటి నంబర్​ గ్రూపులో  పోస్ట్ చేస్తే.. జీహెచ్‌‌‌‌ఎంసీ సిబ్బంది, ప్రత్యేకంగా నియమించుకున్న వలంటీర్లు వాటిని కొని నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. డబ్బులను ఆన్​లైన్​ ట్రాన్జాక్షన్​లో తీసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మెడికల్​ స్టాఫ్​ అప్పటికప్పుడు గ్రూపులో పోస్ట్‌‌‌‌ చేస్తున్నారు. ప్రభుత్వ సందేశాలు, అధికారుల సూచనలను వివరిస్తున్నారు.

యూనిటీ మెసేజ్

కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లలో వాట్సాప్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఏర్పాటు చేసిన తర్వాత పని ఈజీ అయ్యిందని యూసుఫ్‌‌‌‌గూడకు చెందిన బల్దియా అధికారి రమేశ్‌‌‌‌ చెప్పారు. అధికారులు ఏదైనా చెప్పాలంటే గ్రూప్​లో పెడితే అందరికీ ఒకేసారి తెలిసిపోతోందన్నారు. ప్రజలు తమ డౌట్స్​ కూడా అడిగి క్లియర్​ చేసుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు అందరికీ ఒకే రకమైన సమస్యలుంటున్నాయన్నారు. యూనిటీగా సమస్యపై ధైర్యంగా పోరాడే స్ఫూర్తిని వాట్సాప్​ గ్రూప్ ​ఇచ్చిందని చెప్పారు.