హైదరాబాద్లో నకిలీ లేడీ కానిస్టేబుల్..ఖాకీ డ్రెస్ వేసుకుని ఉన్నతాధికారులు, వీఐపీ మీటింగ్లకు హాజరు

హైదరాబాద్లో నకిలీ లేడీ కానిస్టేబుల్..ఖాకీ డ్రెస్ వేసుకుని ఉన్నతాధికారులు, వీఐపీ మీటింగ్లకు హాజరు

హైదరాబాద్ లో నకిలీ లేడీ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఉద్యోగం రాకున్నా..ఏం చక్కగా  ఖాకీ డ్రెస్ వేసుకుని కానిస్టేబుల్ గా చలామణీ అవుతూ డైలీ ఉద్యోగం చేస్తోంది ఓ యువతి. సెక్రటేరియట్ లలో  ఉన్నతాధికారులతో మీటింగ్ లకు , వీఐపీ మీటింగ్ లకు సైతం హాజరవుతోంది.  ఇలా నకిలీ కానిస్టేబుల్ గా తిరుగుతోన్న ఓయువతి వ్యవహారం నవంబర్ 21న బట్టబయలైంది.

అసలేం జరిగిందంటే..?  పోలీసులు చెప్పిన వివరా ప్రకారం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోఉమాభారతి(21) అనే యువతి  నకీలీ ఖాకీ కానిస్టేబుల్  గా అవతారమెత్తింది. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో ఖాకీ డ్రెస్ కొనుక్కుని  డ్యూటీలు చేస్తోంది ఉమాభారతి. షాపూర్ నగర్ కు చెందిన ఉమాభారతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు జీడిమెట్ల పోలీసులు.

►ALSO READ | ఎయిర్‌పోర్ట్స్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు.. సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం

గతంలో విఐపీ మీటింగ్ లతో పాటు సెక్రటేరియట్,సైబరాబాద్ సీపీ ఆఫీస్ లల్లో మీటింగ్ లకు సైతం హాజరైనట్లు చెప్పారు. నవంబర్ 21న  సైబరాబాద్ సీపీ  ఆఫీస్ క్యాంటీన్ లో నకిలీ కానిస్టేబుల్  టిఫిన్ తింటుండగా ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరాదీశారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. యువతిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు జీడిమెట్ల పీఎస్ కు కేసును అప్పగించారు.