ముంబై మహానగరం ఎన్నో వింతలకు కేర్ ఆఫ్ అడ్రస్.. ఎప్పుడు ఏదో వైరల్ ట్రాఫిక్ సీన్లతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. అలాంటి బిగ్ సిటీ రోడ్లపై బజాజ్ క్యూట్ కారు కమ్ ఆటోరిక్షా హల్ చల్ చేస్తోంది.. ప్రయాణికులను ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా స్మార్టర్, క్యూటర్ గా పరుగులు పెడుతోంది.. ఇది చూసి ముచ్చటేసిన ఓ కమ్యూటర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాగా వైరల్ అవుతోంది..
బజాజ్ క్యూట్క్వాడ్రిసైకిల్ ఆటో.. అంటే కాంపాక్ట్ ఫోర్ వీలర్..అదేనండి బజాజ్క్యూట్ మోడల్ కారు. ముంబై వీధుల్లో రయ్ రయ్ మని పరుగులు పెడుతుంటే ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు ఓ ప్రయాణికుడు. ముంబై లో ఆటో రిక్షాలకు బాగాడిమాండ్ ఉంది.. పైగా వాటిలో ఎలాంటి సౌకర్యాలు ఉండవు.. ఇది గమనించిన ఓ డ్రైవర్ తన బజాజ్ క్యూట్ కారుకు ముందు వెనక ఆటో అని రాసుకొని ఆటోలా కిరాయిలకు నడుపుతున్నాడు. బజాజ్ క్యూట్‌గా నిజంగా క్యూట్ గా ఉండటం.. ముందు వెనక ఆటో రాసుకొని ప్రయాణికులను కంఫర్ట్ గా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే.. ముచ్చటేసి వీడియో తీశాడు. ఇది బాగా వైరల్ అవుతోంది.
ఇక నెటిజన్లు ఈ క్యూట్ క్యూట్ బజాజ్ క్యూట్ కారు కమ్ ఆటో గురించి రకరకాలు కామెంట్స్ పెట్టారు. కొందరు కామెడీగా, ఇంకొందరు ఆశ్చర్యంగా, మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు. బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కు ఇది దక్షిణ ముంబైకి వెళ్తుంగా ఓ నెటిజన్..సోబోకు వెళ్తుందా అంటూ మరో నెటిజన్ కామెంట్లు పెట్టారు.
ఆ కారు కమ్ ఆటోకు మీటర్ వేస్తారా.. లేక క్యాబ్ ఛార్జీలపై నడుస్తుందా? అని అంటూ ఓ నెటిజన్ చార్జీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్ చేశాడు.
బజాజ్ క్యూట్ (Bajaj Qute) ఇది చూడటానికి చిన్న కారులా అనిపించినా..సాంకేతికంగా దీనిని 'క్వాడ్రిసైకిల్' (Quadricycle) అని పిలుస్తారు. ఇది ఆటోరిక్షా ,కారుకి మధ్యస్తంగా ఉండే వాహనం. 216.6 cc డీటీఎస్-ఐ ఇంజిన్ - లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ఆటోలలో ఉండే ఇంజిన్ వంటిదే.ఇది పెట్రోల్,సిఎన్‌జీ వేరియంట్లలో లభిస్తుంది.అద్బుతమైన మైలేజీ లభిస్తుంది. డ్రైవర్‌తో కలిపి నలుగురు (1+3) సౌకర్యవంతంగా కూర్చునే సీటింగ్ ఉంటుంది. గంటకు 70 కిలో మీటర్ల వేగంతో నడపొచ్చు. ప్రయాణానికి ఆటోరిక్షా కంటే ఇది చాలా ఉత్తమమైంది.. స్మార్టర్, సేఫర్, క్యూటర్ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
