హైదరాబాద్ అమీర్ పేటలో దారుణం జరిగింది. ఓప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి విద్యార్థి నిండు ప్రాణం బలైంది. స్కూల్ ట్రిప్ లో భాగంగా విద్యార్థులను వండర్ లాకి తీసుకెళ్లింది యాజమాన్యం. వయసుకి మించిన ఆక్టివిటీస్, గేమ్స్ ఆడించడంతో 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే అమీర్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతోన్న 8 వ తరగతి విద్యార్థి సూర్యతేజ ట్రిప్ లో భాగంగా విద్యార్థులతో కలిసి వండర్ లాకి వెళ్ళాడు. అక్కడ విద్యార్థి సూర్యతేజతో టీచర్ పలు యాక్టివిటీస్ చేయించింది. దీంతో అలిసిపోయి కింద పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు సూర్యతేజ. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సూర్యతేజ నవంబర్ 22న మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
