చేవెళ్ల టు గచ్చిబౌలి బస్సు సర్వీస్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీరిన కష్టాలు

చేవెళ్ల టు గచ్చిబౌలి బస్సు సర్వీస్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీరిన కష్టాలు

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల నుంచి గచ్చిబౌలి వరకు బస్సు సర్వీస్​ను ఆర్టీసీ ప్రారంభించింది. చేవెళ్లతో పాటు మొయినాబాద్ ప్రాంతం నుంచి వందల మంది గచ్చిబౌలి ఏరియాలోని సాఫ్ట్ వేర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే అప్పా జంక్షన్​ వరకు వెళ్లి.. అక్కడి నుంచి క్యాబ్​ బుక్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. 

వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీఎస్​ ఆర్టీసీ సిటీ రీజినల్​ మేనేజర్​ సుధా పరిమళ ఆదేశాల మేరకు శుక్రవారం మెహిదీపట్నం డిపో మేనేజర్​ బీవీకే మూర్తి మెట్రో డీలక్స్​ సర్వీస్​ ప్రారంభించారు. 593/316  నంబర్  గల ఈ బస్సు చేవెళ్ల, మొయినాబాద్, అప్పా జంక్షన్ , నార్సింగి జంక్షన్ మీదుగా ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డులో గచ్చిబౌలి వరకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు తిరుగుతుంది.