రెండో రోజు నోరు విప్పని ఐబొమ్మ రవి

రెండో రోజు నోరు విప్పని ఐబొమ్మ రవి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు విచారణలో రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అనేక ప్రశ్నలకు మౌనంగానే ఉన్నట్లు సమాచారం. డబ్బు కోసమే తాను బెట్టింగ్​ప్రమోషన్​ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. 

కొద్ది సంవత్సరాల క్రితం వన్ ఎక్స్ బెట్ వన్ విన్ నిర్వాహకులు తనను సంప్రదించారని చెప్పారు. సినిమా వీడియో మధ్యలో బెట్టింగ్ బగ్స్ ప్రమోట్ చేయాలని ఆయనను కోరినట్లు వెల్లడించారు. అయితే, వన్ ఎక్స్ బెట్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం రవి నిరాకరించారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది.