కేటీఆర్ ఆరోపణలు నిరాధారం : ఎంపీ చామల

కేటీఆర్ ఆరోపణలు నిరాధారం : ఎంపీ చామల
  • ఇదంతా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేసే కుట్ర: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలన్నీ  నిరాధారమైనవని, ఇవి  ప్రజల ముందు రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేసే కుట్ర అని వెల్లడించారు.

 శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘పరిశ్రమల భూములపై సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు 50 వేల కోట్ల రూపాయలు లాభంపొందారని కేటీఆర్ చేసిన ఆరోపణలను అబద్ధం. పరిశ్రమల యజమానుల నుంచి దోచుకున్నవి మీరు కాదా?" అని నిలదీశారు.