గోదావరిఖనిలో తల్లిదండ్రులు మందలించారని కొడుకు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖనిలో తల్లిదండ్రులు మందలించారని కొడుకు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • గోదావరిఖని పట్టణంలో ఘటన

జ్యోతినగర్, వెలుగు : తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోదావరిఖని పట్టణంలో శుక్రవారం జరిగింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖనిలోని గౌతమినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కరుణమ్మ దంపతుల కుమారుడు శ్యామ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19) ఐటీఐ మధ్యలోనే ఆపేసి ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. 

దీంతో ఏదైనా పని చేసుకోవాలని కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం చైతన్యపురి కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యువకుడి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

చనిపోయిన యువకుడు కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎన్టీపీసీ ఎస్సై తెలిపారు. కాగా, కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదు రోజుల కింద కూడా ఇదే రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడియో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో వారు వచ్చి కాపాడినట్లు తెలుస్తోంది.