కోటపల్లి, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కోటపల్లి మండలంలోని నక్కలపల్లికి ఐదేళ్లుగా ఆర్టీసీ బస్సు కరువైంది. దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూర్ ఎమ్యెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రతీ పల్లెకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఇందులో భాగంగా ఆయన ఆదేశాలతో అధికారులు నక్కలపల్లి రోడ్డును బాగు చేసి, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మారుమూల పల్లెలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. బస్సు శుక్రవారం గ్రామానికి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
