కారు డ్రైవర్ మిస్సింగ్.. యజమానిపై అనుమానం

కారు డ్రైవర్ మిస్సింగ్.. యజమానిపై అనుమానం

జూబ్లీహిల్స్, వెలుగు: తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఓ మహిళ ఫిలింనగర్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్ చత్రపతి శివాజీ నగర్​కు చెందిన శివానంద్ (40), అనసూయకు ముగ్గురు సంతానం. గత 16 ఏండ్లుగా సతీశ్ అనే వ్యక్తి వద్ద శివానంద్  కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

గత నెల దీపావళి రోజున శివానంద్ కు యజమాని నుంచి ఫోను రావడంతో ఇంటి నుంచి హుటాహుటిన డ్యూటీకి వెళ్లాడు. నెల రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో శివానంద్ పనిచేస్తున్న యజమాని సతీశ్ పై అనుమానం వ్యక్తం చేస్తూ అనసూయ పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.