హైదరాబాద్: GHMC ఈవీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గుర్తుతెలియని దుండగులు చార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉప్పల్ నుంచి తార్నాక వచ్చే రూట్లో ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఈ ఘటన జరిగింది. తన ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ అయిపోవడంతో, హైదరాబాద్ నగరంలోని పలు ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఛార్జింగ్ పెట్టుకునేందుకు కారు యజమాని ఆగాడు. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర చార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లడం గమనించి ఆశ్చర్యపోయిన సదరు కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా ఛార్జింగ్ పాయింట్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చార్జింగ్గన్స్ చోరీకి గురవడం ఇది తొలిసారి కాదు. చార్జింగ్ పాయింట్లయితే ఏర్పాటు చేశారు గానీ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చాదర్ఘాట్ ఇసామియా బజార్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్వెహికల్స్ చార్జింగ్పాయింట్ దగ్గర కూడా మార్చి నెలలో చార్జింగ్ గన్స్ చోరీకి గురయ్యాయి.
ALSO READ : నువ్వు ఆఫ్ట్రాల్ బీహార్ గాడివి..
ప్రైవేట్ సెంటర్లతో పోలిస్తే GHMC ఈవీ చార్జింగ్ సెంటర్లలో చార్జింగ్పెడితే అయ్యే ఖర్చు తక్కువే. పైగా ఈ స్టేషన్లను 60 కిలోవాట్స్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో కారు దాదాపు 20 యూనిట్స్కి పైగా కెపాసిటీతో ఉంటున్నాయి. GHMC సెంటర్లలో చార్జింగ్పెడితే 35 నుంచి 40 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది.
గ్రేటర్లో 200 వరకు ప్రైవేట్ చార్జింగ్ సెంటర్లుండగా, ఇక్కడ ఒక్కో యూనిట్కు రూ.20 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. అలాగే 18 శాతం జీఎస్టీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అదే GHMC సెంటర్ల వద్ద యూనిట్కి రూ.13తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి రూ.15.34 వరకు అవుతోంది. పేమెంట్ కూడా టీఎస్ఈవీ యాప్ ద్వారా చేయొచ్చు.
