మహారాష్ట్రలో ప్రాంతీయ వాదం వివాదానికి దారితీసిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక ఆఫీసులో చోటుచేసుకున్న దాడికి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఈ ఘటనలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలుగా చెప్పబడిన కొంతమంది వ్యక్తులు ఒక యజమానిపై చేయి చేసుకున్నారు.
వాస్తవానికి వీడియోలో కూర్చుని మాట్లాడుతున్న యజమాని ఒక బీరాహీ. అయితే ఆఫీసులో ఒక మహిళా ఉద్యోగి ఆలస్యంగా పనికి రావటంతో రేపటి నుంచి టైంకి రావాలంటూ ఓనర్ చెప్పాడు. అయితే దీనిపై ఆగ్రహించిన సదరు లేడీ నేను మరాఠీని నేనేందుకు బీహారీ మాట వినాలి అంటూ ఓనర్ కి చెప్పటంతో వివాదం మెుదలైంది. అయితే ఈ వివాదంలోకి నవ నిర్మాణ సేన కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చారు. వారు మహిళ తరపున మాట్లాడుతూ సదరు యజమానిని మాట్లాడటానికి పిలిచారు.
बॉस ने पूछा तुम टाइम पर ऑफिस क्यों नही आती हो?
— Nehra Ji (@nehraji77) November 21, 2025
महिला ने कहा मैं मराठी हूँ
यह मेरा महाराष्ट्र है यहां तुम बिहार वालो की नही मेरी चलेगी
राज ठाकरे के पार्टी के लोगो ने जाकर बॉस की पिटाई कर दी pic.twitter.com/d7cutqz1KV
వీడియోలో పసుపు రంగు టీషర్టులు ధరించిన ఇద్దరు నవ నిర్మాణ సేనకు చెందిన వ్యక్తులు యజమానితో మాట్లాడుతున్నప్పుడు.. మాటా మాటా పెరగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారు సదరు బీహారీ యజమానిని పదే పదే చెంపదెబ్బలు కొడతారు. అదే సమయంలో అక్కడ ఉన్న మహిళా ఉద్యోగిని కూడా కోపంతో తిడుతూ.. చేయిచేసుకుంది. అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఆగ్రహంగా బెదిరిస్తూ కనిపించారు వీడియోలో. ఇదంతా చూసిన చాలా మంది రౌడీ రాజ్యం మళ్లీ ముంబైలో అడుగుపెట్టిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించటం పూర్తిగా చట్ట వ్యతిరేకం, ఆఫీసుల్లోకి రాజకీయాలను తీసుకురావటం సరైనది కాదని అంటున్నారు.
ఆఫీసు విషయాల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరైంది కాదని విమర్శిస్తున్నారు నెటిజన్లు. మరికొందరు ప్రాంతీయత, భాషా ఆధారంగా వ్యక్తులను వేరు చేయడం ఘోరమని అంటున్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రాంతీయ అసహనంతో పాటు రాజకీయ జోక్యం మీద భిన్నాభిప్రాయాలను చెలరేగేలా చేసింది.
