ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను నియమించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఏపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. 

పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఊమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిస్టొఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పళ్లం రాజు, చింతామోహన్, సుబ్బరామిరెడ్డి, జేడీశీలం, జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు ఉన్నారు. 18మందితో రాజకీయ వ్యవహారాల  కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించారు. కో ఆర్డినేషన్‌ కమిటీలో అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. ఇక ఇప్పటివరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఎస్.శైలజానాథ్‌ పనిచేశారు.