విజయ్‌‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్దమైన గిల్

విజయ్‌‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్దమైన గిల్

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్‌‌, వన్డే కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌.. విజయ్‌‌ హజారే ట్రోఫీలో ఆడేందుకు రెడీ అయ్యాడు. శనివారం, మంగళవారం సిక్కిం, గోవాతో జరిగే రెండు మ్యాచ్‌‌ల్లో అతను పంజాబ్‌‌ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. 

వెటరన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా కూడా ఈ నెల 6, 8న సర్వీసెస్‌‌, గుజరాత్‌‌తో జరిగే మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉంటానని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌‌కు తెలిపాడు. వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ బ్యాటర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ కూడా త్రిపుర (3న), రాజస్తాన్‌‌ (6న)తో జరిగే మ్యాచ్‌‌ల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కర్నాటక క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు. న్యూజిలాండ్‌‌తో వన్డే సిరీస్‌‌ నేపథ్యంలో ఈ ముగ్గురు వీలైనంత త్వరగా విజయ్‌‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌‌లను ముగించుకోవాల్సి ఉంది. పంజాబ్‌‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌‌లకు గిల్‌‌ అందుబాటులో ఉన్నా ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో మాత్రం ఆడలేదు. ఇప్పటికే టీ20 వరల్డ్‌‌ కప్‌‌కు దూరమైన గిల్‌‌ను ఈ ఏడాది ఆసియా కప్‌‌ కోసం అతన్ని తిరిగి తీసుకొచ్చారు. కానీ షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో గిల్‌‌ పెర్ఫామెన్స్‌‌ అనుకున్నంత బాగా లేకపోవడంతో వేటు తప్పలేదు. మరి ఇప్పుడు వన్డేల్లోనైనా రాణిస్తాడా చూడాలి.