రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి.. ఆటో డ్రైవర్ అత్యాచారం

రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి.. ఆటో డ్రైవర్ అత్యాచారం

రైల్వేస్టేషన్‌లో తప్పిపోయి.. ఒంటరిగా ఉన్న ఓ చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడో ఆటో డ్రైవర్. చండీగఢ్‌లో రెండ్రోజుల క్రితం జరిగిందీ దారుణం. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఇవాళ కోర్టులో హాజరుపరిచారు.

తన అంటీతో ఊరెళ్తున్న చిన్నారి చండీగఢ్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయింది. దీంతో ఎటుపోవాలో అర్థంకాక ఏడుస్తూ.. స్టేషన్ బయట ఉన్న ఓ ఆటోలో కూర్చుంది. ఆ అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని ఆటో డ్రైవర్ అడగగా, తనతో వచ్చిన వాళ్లను మిస్సయ్యానని చెప్పింది. ఆ చిన్నారి ఒంటరిగా ఉందని తెలియడంతో అతడిలోని దుర్మార్గుడు మేలుకొన్నాడు. ఆ అమ్మాయిని సమీపంలోని తన ఇంటికి తీసుకెళ్లి.. రేప్ చేశాడు. ఈ ఘటనపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీస్ ఎస్సై ఊర్మిలా దేవి చెప్పారు. చండీగఢ్ సెక్టార్-45 పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి తమకు అప్పగించారని తెలిపారామె. అతడిని ఇవాళ కోర్టులో హాజరుపరచగా.. రెండ్రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి