V6 News

బాలికపై యువకుడి వేధింపులు ..ఆ తరువాత ఏం జరిగిందంటే..

బాలికపై యువకుడి వేధింపులు ..ఆ తరువాత ఏం జరిగిందంటే..

వికారాబాద్, వెలుగు: యువకుడి వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం నాసన్‌పల్లి గ్రామానికి చెందిన సింధు పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్‌, వరుసకు అన్న అయ్యే యువకుడు సింధును కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికి వెళ్లి ఇబ్బందులు పెట్టేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేక ఆదివారం సింధు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.