
ఇటీవలి కాలంలో మనుషులకు మనుషుల మీద ఉన్న ప్రేమ కంటే అటు పెంపుడు జంతువుల మీద ప్రేమ ఎక్కువగా పెరిగి పోతుంది అని చెప్పాలి. అంతేకాదు నేటి రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది.ఇంట్లో మనిషి లాగా కాదు ఏకంగా సొంత మనిషిలాగ పెంపుడు జంతువులను చూసుకుంటూ అమితమైన ప్రేమను చూపిస్తున్న వారు కూడా నేటి రోజులలో చాలామంది ఉన్నారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువు హఠాత్తుగా చనిపోతే ఎవరైనా బాధపడతారు. ప్రస్తుతం, ఒక పెంపుడు జంతువు – మనిషి మధ్య అద్భుతమైన ప్రేమను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీ కళ్లలో తప్పకుండా కన్నీళ్లు వస్తాయి.
ఒక అమ్మాయి తన ఒడిలో పిల్లిని పెట్టుకుని ఏడుస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, ఆమె పెంచుకున్న పిల్లి చనిపోయింది. కానీ అమ్మాయి నుండి విడిపోవడాన్ని ఆమె తట్టుకోలేక వెక్కివెక్కి ఏడుస్తుంది. తనని కౌగిలించుకుంటున్న తీరు చూస్తుంటే పిల్లి అంటే ఆమెకు చాలా ఇష్టమనిపిస్తోంది. చనిపోయిన పిల్లిని తన ఛాతీకి కౌగిలించుకుని ఎలా ఏడుస్తుందో వీడియోలో చూడవచ్చు. పిల్లి ఆకస్మికంగా మృతి చెందడం ఆ బాలికకు దిగ్భ్రాంతి కలిగించింది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో kohtshoww అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 2 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అయితే 21 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.
కొంతమందికి జంతువులతో చాలా అనుబంధం ఉంటుంది. వాటికి వారిపై కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ జంతువులను వారు చిన్న పిల్లలా సాదుకుంటారు. వాటికి చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు. వాటి కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. ఆ జంతువు తమ పెంపుడు జంతువు అయితే, ప్రజలు పగలనక రాత్రనక వాటి సేవలో ఏకమవుతారు. చాలా మంది తమ పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం విడివిడిగా ఇళ్లను నిర్మించి అందులో హాయిగా జీవించేందుకు ఏర్పాట్లు చేయడం కూడా చేసి ఉండడం చూసి ఉంటారు. కొంతమంది తమ పెంపుడు జంతువులను ఎంతగానో ప్రేమిస్తారు. వారు తమ కోట్ల ఆస్తిని వారి పేరు మీద కూడా ఇస్తారు.