
- డబ్బును ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన బాధితుడు
ఒట్టావా: ఓ ప్రేమికుడికి అదృష్టం లాటరీ రూపంలో తగిలితే దురదృష్టం ప్రియురాలి రూపంలో వెంటాడింది.లాటరీలో రూ.30 కోట్ల జాక్ పాట్ తగిలిందని ఆనంద పడే లోపే.. ఆ డబ్బులతో ప్రియురాలు ఉడాయించి ప్రియుడికి షాకిచ్చింది. కొత్త ప్రియుడితో సెటిల్ అయ్యి అతడికి తీరని వేదనను మిగిల్చింది. కెనడా దేశస్తుడు లారెన్స్ కాంప్ బెల్ 2024లో లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి 5 మిలియన్ల కెనడా డాలర్లు (రూ.30కోట్లు) గెలుచుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే ప్రైజ్ మనీ తీసుకునేందుకు అతనికి వ్యాలిడ్ బ్యాంక్ ఐడీ లేదు.
దీంతో అతడు తన ప్రియురాలు క్రిస్టాల్ అన్ మెక్కేనీని లాటరీ డబ్బులు తన అకౌంట్లో వేసుకోవాల్సిందిగా కోరాడు. దీంతో ప్రియురాలు లాటరీ డబ్బులను తన అకౌంట్లో జమ చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలం వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లకు ప్రియురాలు కనిపించకుండా పోయింది.
ఒకవైపు ప్రియురాలు మరోవైపు రూ.30 కోట్ల డబ్బు కనిపించకుండా పోవడంతో లారెన్స్ ఆమె కోసం వెతకడం మొదలు పెట్టాడు. చివరకు ప్రియురాలి ఆచూకీ కనిపెట్టాడు. కానీ, లారెన్స్కు గుండె బద్దలయ్యే వాస్తవం తెలిసింది. తన ప్రియురాలు మరో యువకుడితో సెటిలైందని తెలుసుకుని ప్రియుడు కుమిలిపోయాడు. ఆమె మోసాన్ని గ్రహించి కోర్టును ఆశ్రయించాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరాడు.