విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్..!

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్..!

హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మయిలను ట్రాప్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. ఇందుకు గాను విజయ్ దేవరకొండ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రొఫైల్ ను క్రియేట్ చేసి… ఆయన్ని కలవాలంటే సదరు నెంబర్ కు కనెక్ట్ అవ్వాలంటే ఓ నెంబర్ ను ఇచ్చారు. ఈ ప్రొఫైల్ ను గుర్తించిన విజయ్.. సోషల్ మీడియాలో తప్పుడు వ్యక్తులను గుర్తించేందుకు విజయ్ మేనేజర్ ఓ అమ్మాయిగా సదరు వ్యక్తులతో చాట్ చేశాడు. దీంతో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించిన మేనేజర్…  తగిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.